రోడ్డు ప్రమాదాల్లో టాప్-10లో నిలిచిన తెలుగు రాష్ట్రాలు

14470చూసినవారు
రోడ్డు ప్రమాదాల్లో టాప్-10లో నిలిచిన తెలుగు రాష్ట్రాలు
AP: రోడ్డు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలు టాప్-10లో నిలిచాయి. దేశవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో ఈ రెండు రాష్ట్రాల్లో గణనీయ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు ‘రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా-2023’ నివేదికలో తెలిపింది. రోడ్డు ప్రమాదాల్లో ఏపీ 7వ స్థానంలో, తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. రోడ్డు ప్రమాద మరణాల్లో ఏపీ 9, తెలంగాణ 10వ స్థానంలో నిలిచినట్లు నివేదిక స్పష్టం చేసింది. తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.

సంబంధిత పోస్ట్