అమెరికా ఎన్నికల్లో తెలుగు మహిళ సరితా కోమటిరెడ్డి ఓటమి!

32చూసినవారు
అమెరికా ఎన్నికల్లో తెలుగు మహిళ సరితా కోమటిరెడ్డి ఓటమి!
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి పోటీ చేసిన తెలుగు మహిళ సరితా కోమటిరెడ్డికి ఓటమి ఎదురైంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి లెటిటియా జేమ్స్ ఆమెపై విజయం సాధించారు. ఫలితాల అనంతరం స్పందించిన సరిత, ప్రజాసేవ కోసమే తాను పోటీ చేశానని, ఓడినా ఆ సేవా దృక్పథాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఉగ్రవాదం, సైబర్ నేరాల కేసుల్లో అనుభవం ఉన్న సరిత తల్లిదండ్రులు కరీంనగర్ జిల్లాకు చెందిన వారు. బ్రూక్లిన్‌లో జన్మించిన ఆమె, నగరాన్ని సురక్షితంగా మార్చేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తానని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్