‘తెలుసు కదా’ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్

19570చూసినవారు
‘తెలుసు కదా’ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్
సిద్ధు జొన్నలగడ్డ, రాశీఖన్నా, శ్రీనిధిశెట్టి ప్రధాన పాత్రధారులుగా నీరజా కోనా దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించిన ముక్కోణపు ప్రేమకథాచిత్రం ‘తెలుసు కదా’. ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానున్నది. సెన్సార్‌ బోర్డ్‌ ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్‌ను అందించింది. 2గంటల 16 నిమిషాల నిడివి గల ఈ సినిమా ఎలాంటి లాగింగ్‌ లేకుండా, వినోదభరితంగా సాగిందని సెన్సార్‌వారు అభినందించారని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్‌.థమన్‌.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్