దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరులని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తోందని సీఎం తెలిపారు. భక్తులు ఇచ్చే కోట్లాది రూపాయల విరాళాలను పేదల శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తున్నామని సీఎం వెల్లడించారు.