అన్నదమ్ములు గొడవ.. అడ్డుకోబోయిన వదిన మృతి

34412చూసినవారు
అన్నదమ్ములు గొడవ.. అడ్డుకోబోయిన వదిన మృతి
TG: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో విషాద ఘటన జరిగింది. కొండాపురం గ్రామానికి సురేష్ తన అన్న రమేష్‌కు 4 నెలల క్రితం రూ.10 వేలు అప్పు ఇచ్చాడు. అప్పు చెల్లించకపోవడంలో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం వారిద్దరికీ గొడవ జరగ్గా, అన్నపై సురేష్ కత్తితో దాడి చేశాడు. అడ్డుకునేందుకు వెళ్లిన రమేష్ భార్య స్వరూప (40) కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయింది. పోలీస్ స్టేషన్‌లో నిందితుడు సురేష్ లొంగిపోయాడు.

ట్యాగ్స్ :