15 లక్షల అప్పుల భారంతో కౌలు రైతు ఆత్మహత్య

20చూసినవారు
15 లక్షల అప్పుల భారంతో కౌలు రైతు ఆత్మహత్య
TG: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పలుగుగడ్డలో పంట నష్టపోయి రూ.15 లక్షల అప్పుల పాలైన కౌలు రైతు లోకుల సాయిరామ్ (30) మనస్తాపంతో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత భూమితో పాటు ఎకరం 20 గుంటలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేయగా, పంట దెబ్బతిని అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పులు తీర్చే దారిలేక పొలంలో ఉరివేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్