
బెల్లంకొండ శ్రీనివాస్‌తో బలగం వేణు రెండో సినిమా ?
బలగం సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్ కొట్టి, జాతీయ అవార్డు అందుకున్న వేణు, తన రెండో సినిమా కోసం కథను సిద్ధం చేసుకున్నారు. మొదట నాని, ఆ తర్వాత నితిన్‌కు వినిపించినా, వివిధ కారణాలతో ఆ ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. తాజాగా, కిష్కింధపురితో హిట్ కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఈ కథను వినిపించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించనున్నారు.




