కోల్‌కతా స్టేడియంలో ఉద్రిక్తత.. మెస్సికి మమతా బెనర్జీ క్షమాపణలు

28చూసినవారు
కోల్‌కతా స్టేడియంలో ఉద్రిక్తత.. మెస్సికి మమతా బెనర్జీ క్షమాపణలు
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కోల్‌కతా పర్యటన సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వహించిన ఈవెంట్ తీవ్ర వైఫల్యానికి గురైంది. షెడ్యూల్ ప్రకారం మెస్సీ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడకపోవడంతో అభిమానులు ఆగ్రహించి, స్టేడియంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యక్రమానికి రాకుండానే వెనుదిరిగారు. ఈవెంట్ నిర్వహణ లోపంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, మెస్సీకి, అభిమానులకు క్షమాపణలు తెలిపారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.