శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీ నుంచి వచ్చిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన విమానం ల్యాండైనా ప్రయాణికులు కిందకు దిగలేదు. సాయంత్రం 6 గంటలకు బయల్దేరాల్సిన విమానం 45 నిమిషాలు ఆలస్యమైంది. లగేజీని సిబ్బందికి ఇచ్చి కిందకు దిగాలని అనౌన్స్ చేయడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక యంత్రాలు కూడా చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.