TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల ఆందోళన చేపట్టారు. ఏళ్లు గడుస్తున్నా బిల్లులు రావడం లేదని నిరసన తెలిపారు. భట్టి విక్రమార్కను కలవనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు భట్టితో అపాయింట్మెంట్ ఇప్పించే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పోలీసులకు.. రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల మధ్య వాగ్వాదం జరిగింది.