TG: రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల పనితీరు, విద్యుత్ ఉత్పత్తిపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిశీలన చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పరిశీలనకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకుల బృందం వెళ్లింది. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.