రాష్ట్రంలో ఉద్రిక్తత.. సీఎం రేవంత్ నివాసం వద్ద భారీ బందోబస్త్

15చూసినవారు
కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆందోళనలు చేపట్టాయి. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో, సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం ఇంటికి వెళ్లే మూడు మార్గాల్లోనూ పోలీసులు కాపు కాస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్