ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. ఎయిరిండియా, ఇండిగో అడ్వైజరీ

13చూసినవారు
ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. ఎయిరిండియా, ఇండిగో అడ్వైజరీ
గత కొన్నిరోజులుగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని వాణిజ్య విమానాల రాకపోకలకు మూసివేసింది. దీనితో భారత విమానయాన సంస్థలైన ఎయిరిండియా, ఇండిగో తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. ఉద్రిక్తతల దృష్ట్యా కొన్ని విమానాలను దారిమళ్లిస్తున్నామని, మరికొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని సంస్థలు తెలిపాయి. ప్రయాణికులు తమ విమాన సర్వీసుల అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నాయి.

సంబంధిత పోస్ట్