ఆసియా క్రీడల్లో భారత్ తన పతకాల ఖాతా తెరిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత్ రజత పతకాన్ని సాధించింది. వలరివన్, సోనమ్ మస్కర్, విదర్శ వినోద్‌లతో కూడిన త్రయం అద్భుత ప్రదర్శనతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ విభాగంలో చైనా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.