పదో తరగతి ఫలితాలు.. కాసేపట్లో విడుదల

21చూసినవారు
పదో తరగతి ఫలితాలు.. కాసేపట్లో విడుదల
TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ (బుధవారం) మరికాసేపట్లో విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీ కాంప్లెక్స్‌లో కే. కేశవరావు ఫలితాలను వెల్లడించనున్నారు. రాష్ట్రంలో మార్చి 16 నుండి ఏప్రిల్ 13 వరకు జరిగిన ఈ పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జవాబుపత్రాల మూల్యాంకనం 23వ తేదీతో పూర్తయింది. విద్యార్థులు SSC అధికారిక వెబ్‌సైట్‌లో, అలాగే వాట్సప్ ద్వారా (80969 58096 నంబర్‌కు 'Hi' అని మెసేజ్ చేసి) ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్