AP: గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో మంగళవారం చైతన్య టెక్నో పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న దుర్గా సంపత్ (16) అనే విద్యార్థి బ్రేక్‌కి వెళ్లి.. తిరిగి తరగతి గదిలోకి వెళ్తూ.. ఒక్కసారి కుప్ప కూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా విద్యార్థి మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. గుండెపోటుతో చనిపోయి ఉంటాడని వైద్యులు భావిస్తున్నారు. ఈ ఘటనతో బాలుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.