AP: కాలకృత్యాలు తీర్చుకుంటుండగా ప్రమాాదవశాత్తు కాలువలో జారిపడి టెన్త్ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ఘటన ప.గో జిల్లా ఇరగవరం మండలంలో చోటుచేసుకుంది. అయినపర్రు గ్రామానికి చెందిన కర్రీ మోహన్ రెడ్డి (15) శుక్రవారం ఉదయం స్నేహితులతో కలిసి రాపాక కాలువ వద్ద కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో ప్రమాదవశాత్తు జారి కాలువలో పడ్డాడు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కాలువలో కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులకు ఈత రాకపోవడంతో వారు కాపాడలేకపోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.