గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి పైకప్పులకు డిమాండ్ పెరిగింది. ప్రధాని నరేంద్ర
మోదీ, జర్మనీ ఛాన్స్‌లర్ ఫెడ్రిక్ మెర్జ్ ప్రారంభించిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌తో 'టెర్రస్ టూరిజం' ఊపందుకుంది. ఎత్తైన ఇంటి పైకప్పులకు డిమాండ్, ఆదాయం ఎక్కువగా ఉండటంతో పోల్స్, ఖాడియా, రాయ్‌పూర్ ప్రాంతాల్లోని ఇళ్ల పైకప్పులు పండుగకు ముందే బుక్ అయ్యాయి. పైకప్పుల అద్దెలు రూ. 20 వేల నుంచి రూ. లక్షన్నర వరకు పలుకుతున్నాయి. సాధారణంగా ఒక రోజు అద్దె రూ. 20-25 వేలు ఉండగా, చివరి క్షణాల్లో ఇది లక్షల్లోకి చేరుతుంది.