పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలే భారత్‌కు ముప్పు అని
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద గ్రూపులు భారత్‌ను నిరంతరం లక్ష్యం చేసుకుంటున్నాయని రూబియో స్పష్టం చేశారు.
భారత్ దృష్టిలో పాకిస్తాన్ సమస్య కేవలం సరిహద్దు వివాదం కాదని, అది ఉగ్రవాదం ద్వారా జరుగుతున్న హైబ్రిడ్ యుద్ధమని, 26/11, పుల్వామా, ఉరి వంటి ఘటనలు దీనికి నిదర్శనమన్నారు.