జమ్మూ-కాశ్మీర్, కిష్ట్వార్ జిల్లాలో 12,000 అడుగుల ఎత్తులో భారత భద్రతా దళాలు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్ సంస్థకు చెందిన రహస్య ఉగ్రవాద స్థావరాన్ని (బంకర్) గుర్తించాయి. ఆదివారం పోలీసులు చేపట్టిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో భాగంగా ఈ బంకర్ను కనుగొన్నారు. ఇందులో చలికాలం కోసం 50 మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్లు, 20 కేజీల బాస్మతి రైస్, మసాలాలు, తాజా కూరగాయలు, వంట గ్యాస్, కలప వంటి భారీ సరుకులు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది గాయపడగా, ఒకరు మరణించారు.