జర్మనీలోని స్పీడ్ లిమిట్ లేని ఆటోబాన్ ఎక్స్‌ప్రెస్‌వేపై గంటకు 286 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న టెస్లా మోడల్ S కారు టైర్ ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ కారులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటం విశేషం. ఆధునిక కార్లు కూడా అధిక వేగంతో వెళ్తున్నప్పుడు చిన్న సాంకేతిక లోపం జరిగినా పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఈ ఘటన హెచ్చరిస్తోంది.