దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, రిషభ్ పంత్ వైస్ కెప్టెన్, వికెట్ కీపర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. జట్టులో జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, సుందర్, బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ రెడ్డి, సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, ఆకాశ్ దీప్ వంటి ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.