2-5 తరగతుల పిల్లలకు యాప్‌ ద్వారా పరీక్ష

2చూసినవారు
2-5 తరగతుల పిల్లలకు యాప్‌ ద్వారా పరీక్ష
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా 2 నుండి 5 తరగతుల వరకు 11.90 లక్షల మంది విద్యార్థులకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) కార్యక్రమంలో భాగంగా మొబైల్ యాప్ ద్వారా బేస్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు జులై 29 వరకు అన్ని జిల్లాల్లో కొనసాగుతాయి. పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడానికి విద్యా సంవత్సరం మొత్తం మూడు పరీక్షలు నిర్వహిస్తారు. గతంలో పెన్ను, పేపర్ విధానంలో జరిగిన పరీక్షల ఫలితాల నమోదులో ఆలస్యం కారణంగా, ఈసారి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో కొత్త మాడ్యూల్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. యాప్ ద్వారా పరీక్షలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారని SCERT అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్