ఇన్‌‌సర్వీస్‌‌ టీచర్ల టెట్‌‌ నోటిఫికేషన్‌‌ వాయిదా వేయాలి: TSPTA

2150చూసినవారు
ఇన్‌‌సర్వీస్‌‌ టీచర్ల టెట్‌‌ నోటిఫికేషన్‌‌ వాయిదా వేయాలి: TSPTA
తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (TSPTA) ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించే టెట్ (TET) నోటిఫికేషన్‌ను అక్టోబర్ 1న కాకుండా డిసెంబర్‌కు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ, ప్రధాన కార్యదర్శి రోహిత్ నాయక్ మాట్లాడుతూ.. నోటిఫికేషన్ విడుదల, పరీక్ష నిర్వహణ మధ్య కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విరామం వల్ల ఉపాధ్యాయులు పరీక్షకు మెరుగ్గా సన్నద్ధమవడానికి, అర్హత సాధించని పక్షంలో తదుపరి పరీక్షకు సిద్ధపడటానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్