టీఎఫ్‌జేఏ నూతన కమిటీ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎఫ్‌జేఏ) నూతన కమిటీ అధ్యక్షుడు వైజే రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, కోశాధికారి సురేంద్ర కుమార్ నాయుడు, ఉపాధ్యక్షులు వి.ప్రేమ మాలిని, జే.అమర్ వంశీలతో కలిసి చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. భవిష్యత్తులో హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ, హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ వంటి ఏర్పాటు ప్రయత్నాలను కమిటీ సభ్యులు చిరంజీవికి వివరించారు.