హైదరాబాద్‌లో పెట్రోల్ బంక్ సిబ్బంది నీళ్లు కలిసిన పెట్రోల్‌ను కొట్టిన ఘటన కలకలం రేపింది. షెర్రిగూడ పరిధిలోని HPCL బంక్‌లో గురువారం రాత్రి తన బ్రెజా కారులో మహేష్ అనే వ్యక్తి పెట్రోల్ కొట్టించుకున్నాడు. ఈరోజు తన కారు ఆగిపోవడంతో మెకానిక్ దగ్గరికి వెళ్లగా నీళ్లు కలిసిన పెట్రోల్ కొట్టారని మెకానిక్ తెలిపారు. దీంతో బంక్‌కు వచ్చి వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించగా, నీళ్లు కలిసి ఉండడం చూసి సిబ్బందితో మహేష్ వాగ్వాదానికి దిగారు.