TG: రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డైట్), ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (DED), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (DPSE) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి టీజీ డీసెట్-2026 షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2026-28 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి గానూ కంప్యూటర్ ఆధారిత పరీక్షా పద్ధతిలో మే 21, 22 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.