TG: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాల పరిరక్షణకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. క్యూర్ (CUAA) పరిధిలో అనుమతి లేకుండా కొత్తగా బోర్ల తవ్వకాలు చేపట్టవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాగునీరు మినహా ఇతర అవసరాలకు శుద్ధి చేసిన మురుగు నీటినే వాడాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు 2027 జులై చివరి వరకు అమల్లో ఉండేలా, సీఎస్ సంజయ్‌జాజు జీవో 259 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. భూగర్భ జలాలను పొదుపుగా వాడుకోవాలని ఈ ఆదేశాల ద్వారా ప్రభుత్వం సూచించింది.