TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ భక్తులకు ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. 'మహాలక్ష్మి' పథకం కింద ప్రస్తుతం మహిళలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఉచిత ప్రయాణ సౌకర్యం, ఇప్పుడు మేడారం జాతర సందర్భంగా నిర్దేశిత ప్రాంతాల్లో పురుషులకు కూడా విస్తరించింది. కోట్లాది మంది భక్తుల సౌకర్యార్థం, ములుగు జిల్లాలోని పస్రా నుండి మేడారం వరకు నడిచే ప్రత్యేక బస్సుల్లో స్త్రీ, పురుష భేదం లేకుండా అందరికీ ఉచిత ప్రయాణాన్ని ఆర్టీసీ అధికారులు కల్పిస్తున్నారు.