TG: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామంలో విషాదం నెలకొంది. ప్రేమ విఫలమైందని ప్రియురాలు హితవర్షిణి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణ వార్త విని ప్రియుడు వినయ్ కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ' నా బంగారు తల్లి లేని లోకంలో నేను బతకలేను' అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్కేసర్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో హితవర్షిణి బిటెక్ ఫోర్త్ ఇయర్ చదువువుతుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.