TG: గుడ్‌న్యూస్.. వారికి రూ. లక్ష

21896చూసినవారు
TG: గుడ్‌న్యూస్.. వారికి రూ. లక్ష
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆదివారం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి CM రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సివిల్స్ ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు రూ.లక్ష అందించనున్నారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటి.. ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న పేద విద్యార్థులకు ఈ అభయహస్తం అర్ధికంగా తోడ్పడుతుంది.