TG: హైదరాబాద్‌లో 20 రెస్టారెంట్లపై TG SAFE బృందాలు తనిఖీలు చేపట్టగా 11 చోట్ల నిబంధనల ఉల్లంఘించినట్లు గుర్తించారు. దీంతో 11 FSSAI లైసెన్సులను సస్పెండ్ చేసి వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. పలు రెస్టారెంట్ల కిచెన్‌లలో బొద్దింకలు, ఈగలు, ఎలుకల బెడదతో పాటు కొన్ని చోట్ల ఎలుకల మలం గుర్తించారు. కాలం చెల్లిన ఆహారం, పాడైన కూరగాయలు, అపరిశుభ్ర ఫ్రిజ్‌లు, మూసుకుపోయిన డ్రైన్లు, శుభ్రత లేని కిచెన్లు బయటపడ్డాయి.