
ఆసీస్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ 339
మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ ముందు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119), ఎల్లీస్ పెర్రీ (77), ఆష్లీ గార్డనర్ (63) కీలక పరుగులు చేశారు. చివరి ఓవర్లో ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయింది. చివరి వికెట్‌గా కిమ్ గార్త్ 17 పరుగులు చేసి రనౌట్ అయ్యారు.




