మిరాయ్ విజయంపై టీజీ విశ్వ ప్రసాద్ ఆనందం

10305చూసినవారు
మిరాయ్ విజయంపై టీజీ విశ్వ ప్రసాద్ ఆనందం
నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ తన మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీవీ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ, దర్శకులకు అడ్వాన్స్ ఇవ్వడం ఆనవాయితీ అని, తాను కూడా ఏడేళ్ల క్రితం దర్శకుడు బాబీకి అడ్వాన్స్ ఇచ్చానని తెలిపారు. ఆదిపురుష్ సినిమా నష్టాల నేపథ్యంలో రాజాసాబ్ సినిమా ఆఫర్ వచ్చిందనే రూమర్లపై కూడా ఆయన స్పందించారు. మిరాయ్ సినిమా విజయం వెనుక కారణాలను, వీఎఫ్‌ఎక్స్ ప్రాముఖ్యతను వివరించారు. కాగా, ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్