లైటింగ్ లోపంతో అరగంట నిలిచిన టీజీ20 గ్రాండ్ ఫైనల్ (వీడియో)

12415చూసినవారు
TG: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ ఫ్లడ్‌లైట్ల సాంకేతిక లోపం వల్ల అరగంట పాటు నిలిచిపోయింది. అన్విత ఖమ్మం ఏసెస్ జట్టు 11 ఓవర్లలో 76 పరుగులు చేసిన సమయంలో లైట్లు ఆగిపోవడంతో ఆటను నిలిపివేశారు. సమస్యను సరిచేసిన తర్వాత మ్యాచ్ పునఃప్రారంభమైంది. ఐపీఎల్ స్థాయి ఏర్పాట్లు చేశామని హెచ్‌సీఏ ప్రకటించినా, ఫైనల్ మ్యాచ్‌లో ప్రాథమిక సదుపాయాల నిర్వహణ లోపించడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్