టీజీ20 లీగ్.. పాలమూరుపై నల్గొండ విజయం

4028చూసినవారు
టీజీ20 లీగ్ 2026లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో నల్గొండ నైట్స్, పాలమూరు స్ట్రైకర్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు 9 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. నల్గొండ నైట్స్ 15.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నల్గొండ కెప్టెన్ రాహుల్ బుద్ధి 68* పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాలమూరు జట్టులో ప్రజ్ఞయ్ రెడ్డి (55), రతన్ తేజ (50) అర్ధ శతకాలు బాదినా జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్