టీజీ20 లీగ్‌.. రంగారెడ్డి రైజర్స్ ఘన విజయం

4036చూసినవారు
టీజీ20 లీగ్‌.. రంగారెడ్డి రైజర్స్ ఘన విజయం
టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్ తమ మూడో విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పాలమూరు నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి రైజర్స్ 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు అవనీష్ (50), గ్యానా రెడ్డి (47) అద్భుత ఆరంభాన్ని అందించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాలమూరు స్ట్రైకర్స్ 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో రంగారెడ్డి రైజర్స్ పట్టికలో రెండో స్థానానికి చేరగా, పాలమూరు మూడో ఓటమితో ఏడో స్థానానికి పడిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్