తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (TGERC) కు 2026-27 ఆర్థిక సంవత్సరానికి జీతాల చెల్లింపుల కోసం రూ.11.65 కోట్ల నిధులకు పరిపాలన ఆమోదం లభించింది. మొత్తం రూ.22.65 కోట్లలో TGERC వాటాగా ఈ నిధులను SBI TGERC ఖాతాకు జమ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నెలవారీ పరిమితులకు లోబడి నిధుల వినియోగం జరగాలని, ఖర్చుల వివరాలతో కూడిన యుటిలైజేషన్ సర్టిఫికేట్‌ను సమర్పించాలని సూచించారు.