సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో దూసుకుపోతున్న TGNPDCL

5514చూసినవారు
సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో దూసుకుపోతున్న TGNPDCL
TG: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం వెంకటాపురం సబ్‌స్టేషన్‌లో పీఎం కుసుమ్ పథకం కింద 2 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను గ్రిడ్‌కు విజయవంతంగా అనుసంధానించారు. దీంతో వెంకటాపురం సబ్‌స్టేషన్ పరిధిలో సౌర విద్యుత్ సామర్థ్యం 3 మెగావాట్లకు చేరింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 11 మెగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా రైతులకు 25 ఏళ్ల పాటు స్థిరమైన రాబడి లభిస్తుందని ఎస్‌ఈ శ్రీనివాసచారి తెలిపారు. జిల్లాలో మొత్తం 93.5 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం ఉంది.

సంబంధిత పోస్ట్