తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు TGPSC గుడ్ న్యూస్ చెప్పింది. రేపు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు TGPSC ఛైర్మన్ వెంకటేశం ప్రకటించారు. ఇక ఈ నెలలో 5 - 6 జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ అవుతాయన్నారు. ఇక నుంచి ప్రతి నెల 3 నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. 3,800 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని, ఇందులో 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులున్నాయని చెప్పారు. CBT విధానంలోనే
పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.