వినూత్న సమస్యతో బాధపడుతున్న కండక్టర్‌కు అండగా టీజీఎస్ఆర్టీసీ

14చూసినవారు
వినూత్న సమస్యతో బాధపడుతున్న కండక్టర్‌కు అండగా టీజీఎస్ఆర్టీసీ
హైదరాబాద్‌లోని మెహిదీపట్నం డిపోలో పనిచేస్తున్న 6.5 అడుగుల ఎత్తుగల బస్ కండక్టర్ అమీన్ అహ్మద్ అన్సారీ, బస్సుల్లో తక్కువ ఎత్తు కారణంగా మెడ, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. ఈ సమస్యను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో స్పందించిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం, అన్సారీకి బస్ పాస్ విభాగం లేదా విమానాశ్రయం కౌంటర్లలో ప్రత్యామ్నాయ విధులను శాశ్వతంగా కేటాయించింది. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన అన్సారీకి ఈ నిర్ణయం ఊరటనిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్