
ఈ నెల 22 నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22 నుంచి 24 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన దుబాయ్, అబుదాబి, యూఏఈలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనలో భాగంగా మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించిన ఏపీఐఐసీ అధికారులు కూడా సీఎం వెంట వెళ్లనున్నారు. ఈ పర్యటనలో పెట్టుబడుల ఆహ్వానం, రాష్ట్ర అభివృద్ధి అవకాశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.




