
అమెరికాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్య
అమెరికాలోని పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్లో భారత సంతతి వ్యాపారి 51 ఏళ్ల రాకేష్ ఎహాగబాన్ తన మోటెల్ బయట కాల్పుల్లో మరణించారు. శుక్రవారం సాయంత్రం మోటెల్ వెలుపల గొడవను ఆపేందుకు ప్రయత్నించగా, అద్దెకు దిగిన స్టాన్లీ యూజీన్ వెస్ట్ అనే వ్యక్తి రాకేష్ తలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన మోటెల్ సీసీటీవీలో రికార్డయింది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.




