నిమజ్జనానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు: సీపీ సజ్జనార్‌

3296చూసినవారు
నిమజ్జనానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు: సీపీ సజ్జనార్‌
TG: గణేశ్‌ నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ధన్యవాదాలు తెలిపారు. నిమజ్జనంలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చారని చెప్పారు. కార్యక్రమానికి ముందు రివ్యూ సమావేశాలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించామని తెలిపారు. నిమజ్జనం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్