మిడ్జిల్‌ ప్రజలకు కృతజ్ఞతలు: సీఎం రేవంత్

0చూసినవారు
మిడ్జిల్‌ ప్రజలకు కృతజ్ఞతలు: సీఎం రేవంత్
TG: తన రాజకీయ ప్రస్థానంలో కీలకమైన మిడ్జిల్‌ ప్రజలకు సీఎం రేవంత్  కృతజ్ఞతలు తెలిపారు. శనివారం బహిరంగ సభలో మాట్లాడుతూ.. '2006 జులై 4న మిడ్జిల్‌ మండల ప్రజలు ఆశీర్వదించారని.. ఆనాడు మీరు నాటిన మొక్క.. ఇవాళ పెద్ద వృక్షమైందన్నారు. మిడ్జిల్‌, కల్వకుర్తి ప్రాంతాలకు గతంలోనే గొప్ప నాయకుడు ఉండేవారని, HYD రాష్ట్రానికి తొలి సీఎంగా చేసిన బూర్గుల రామకృష్ణారావు మహబూబ్‌నగర్‌ బిడ్డేనని గుర్తుచేశారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా దేశానికి సేవలందించిన జైపాల్‌రెడ్డి ఈ జిల్లా బిడ్డేనన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్