TG: హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్‌లో థార్ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడిపి వరుస ప్రమాదాలకు కారణమయ్యాడు. బీఎన్ రెడ్డినగర్ సమీపంలోని గుర్రంగూడ వద్ద వేగంగా దూసుకొచ్చిన థార్ వాహనం ముందుగా ఓ బైకర్ ను ఢీకొట్టింది. అనంతరం డివైడర్ను దాటుకుని ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఆ తర్వాత పల్టీలు కొట్టి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.