సైనికుల కోసం నయా అవతార్‌లో థార్‌ రాక్స్‌

36చూసినవారు
మహీంద్రా థార్‌ ఆధారంగా, దేశీయ సైనిక అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మహీంద్రా ఏటీవీ (ఆల్‌ టెరియన్‌ వెహికల్‌)ని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా పరిచయం చేశారు. బెంగళూరుకు చెందిన ప్రద్‌ 4×4 సంస్థతో కలిసి దీన్ని అభివృద్ధి చేశారు. మెటల్‌ బాడీతో రూపొందించిన ఈ వాహనం ఎయిర్‌డ్రాప్‌ను సైతం తట్టుకోగలదు. 2.2 లీటర్ డీజిల్‌ ఇంజిన్‌తో 172 హెచ్‌పీ శక్తిని, 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఈ ఏటీవీలో ఆయుధాల కోసం గన్‌ మౌంట్‌, అండర్‌ బాడీ ప్రొటెక్షన్‌, విండ్‌షీల్డ్‌ ప్రొటెక్టర్‌, అదనపు టైర్లు, ఇంధనం/నీటి సదుపాయం ఉన్నాయి.

సంబంధిత పోస్ట్