ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం కావాలనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని కవిత మండిపడ్డారు.