ఆ దేశ జాతీయ జంతువు ఆవే… ఎక్కడో తెలుసా?

8చూసినవారు
ఆ దేశ జాతీయ జంతువు ఆవే… ఎక్కడో తెలుసా?
భారతదేశంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో, కేంద్ర పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎస్‌పీ సింగ్ బఘేల్ లోక్‌సభలో స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆయన తెలిపారు. కాగా, హిందువులు అధికంగా ఉన్న నేపాల్.. 2015 సెప్టెంబర్ 20న గోవును అధికారిక జాతీయ జంతువుగా ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 2015లో గోవును రాష్ట్ర జంతువుగా ప్రకటించింది.

సంబంధిత పోస్ట్