AP: విజయవాడ భవానిపురంలో ప్రతిష్టించిన 72 అడుగుల భారీ మట్టి గణపతి నిమజ్జనం మరికొద్దిసేపట్లో జరగనుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనిక రంగులు వాడకుండా సహజ సిద్ధమైన మట్టి, జనపనార, కొబ్బరి పీచు, సహజ రంగులతో తయారైన పంచముఖ వరసిద్ధి మహా గణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రతిష్టించిన చోటే 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో నిమజ్జనం నిర్వహించనున్నారు.